కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2022-02-25T00:30:11+05:30 IST

ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరు నేపథ్యంలో

కేంద్ర విదేశాంగ మంత్రికి ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: ఉక్రెయిన్‌, రష్యా దేశాల మధ్య జరుగుతున్న భీకర పోరు నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్‌కు టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను రప్పించాలని లేఖలో పేర్కొన్నారు. విద్యార్థులను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్‌పోర్టులో తెలంగాణ, ఏపీ విద్యార్థులు చిక్కుకుపోయారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. 


Updated Date - 2022-02-25T00:30:11+05:30 IST