ఎంపీ మాధవ్‌.. గోబ్యాక్‌!

ABN , First Publish Date - 2022-08-16T09:52:14+05:30 IST

నగ్న వీడియో కాల్‌ వ్యవహారం బయటపడ్డాక తొలిసారి.. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి వచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారు.

ఎంపీ మాధవ్‌.. గోబ్యాక్‌!

హిందూపురంలో ఎంపీకి చుక్కెదురు.. అడ్డుకున్న టీడీపీ నేతలు

హిందూపురం, ఆగస్టు 15: నగ్న వీడియో కాల్‌ వ్యవహారం బయటపడ్డాక తొలిసారి.. సోమవారం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి వచ్చిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డుకున్నారు. ‘మాధవ్‌ గో బ్యాక్‌’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయితే, టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని స్టేషన్లకు తరలించారు. హిందూపురం మండలంలోని చౌళూరులో జెండా ఆవిష్కరణకు వెళ్తున్న ఎంపీ వాహనానికి పట్టణంలోని చిన్నమార్కెట్‌ వద్ద టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. పోలీసులు టీడీపీ నాయకులను పక్కకు తోసేసి కాన్వాయ్‌ని పంపించేశారు. ఎంపీ హిందూపురం మండలంలోని చౌళూరుకు వెళ్లి, అక్కడ జెండాను ఆవిష్కరించి తిరిగి వస్తుండగా సంతేబిదునూరు గేటు వద్ద టీడీపీ నాయకులు.. ‘గోరంట్ల మాధవ్‌ డౌన్‌డౌన్‌’ అని నినాదాలు చేశారు. పోలీసులు టీడీపీ నాయకులను వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. తర్వాత మాధవ్‌ వాహనం వెళ్లిపోయింది. 

Read more