Komatireddy venkatreddy: మునుగోడు ప్రచారానికి వెళ్లేదే లేదన్న కోమటిరెడ్డి

ABN , First Publish Date - 2022-10-17T18:39:50+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లేదేలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Komatireddy venkatreddy: మునుగోడు ప్రచారానికి వెళ్లేదే లేదన్న కోమటిరెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల(Munugodu by poll) ప్రచారానికి వెళ్లేదేలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy venkatreddy) మరోసారి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడులో తన లాంటి హోమ్‌గార్డ్స్‌ ప్రచారం అవసరం లేదని అన్నారు. ఎస్పీ స్థాయి నేతలే అక్కడ ప్రచారానికి వెళ్తారని యెద్దేవా చేశారు. ‘‘వంద కేసులు పెట్టినా సరే సర్కార్‌ను తీసుకొస్తానని ఓ నేత చెప్పాడు. ఆయనే మునుగోడు ఉపఎన్నికల్లో గెలిపిస్తాడు.. నాతో ఏం పని?. నేనెప్పుడు విదేశాలకు వెళ్లేది.. కేటీఆర్‌ను అడగండి’’ అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Congress MP) తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-17T18:39:50+05:30 IST