మోదీ ఫొటోలు పెట్టాల్సింది పెట్రోల్‌ బంకుల్లో

ABN , First Publish Date - 2022-09-08T09:34:11+05:30 IST

ప్రధాని మోదీ ఫొటోలు పెట్టాల్సింది రేషన్‌ షాపుల్లో కాదని.

మోదీ ఫొటోలు పెట్టాల్సింది పెట్రోల్‌ బంకుల్లో

రేషన్‌ షాపుల్లో కాదు: కవిత

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 7: ప్రధాని మోదీ ఫొటోలు పెట్టాల్సింది రేషన్‌ షాపుల్లో కాదని.. గ్యాస్‌ సిలిండర్లపై, పెట్రోల్‌ బంకుల్లో పెట్టాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల ఉమ్మడి నిజామాబాద్‌ పర్యటన సందర్భంగా రేషన్‌ షాపుల్లో మోదీ ఫొటో లేదంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్లను కవిత అందజేశారు. ప్రస్తుతం ఇంటికి ఒక్క వృద్ధాప్య పెన్షన్‌ ఇస్తున్నారని, రాబోయే కాంలో ఇంట్లో ఎంత మంది వృద్ధులుంటే అంతమందికి పెన్షన్లు వస్తాయని కవిత హామీ ఇచ్చారు.  ‘నిర్మలా సీతారామన్‌ ఉమ్మడి నిజామాబాద్‌కు వరాలు కురిపిస్తుందనుకుంటే, రేషన్‌ షాప్‌కి వెళ్లి ఫొటోల పంచాయితీ పెట్టారు’ అని విమర్శించారు. కామారెడ్డి కలెక్టర్‌ను అవమానించారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 

Updated Date - 2022-09-08T09:34:11+05:30 IST