రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-01-21T15:42:53+05:30 IST

నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే

రేపు, ఎల్లుండి కొన్ని MMTS రైళ్ల రద్దు

సికింద్రాబాద్‌: నిర్వహణ పనుల కారణంగా ఈనెల 22, 23వ తేదీల్లో కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌, హైదరాబాద్‌-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌-లింగంపల్లి (రైల్‌ నెంబర్‌: 47150), లింగంపల్లి-సికింద్రాబాద్‌ (రైల్‌ నెంబర్‌: 47195) సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. (నెంబర్‌: 07762) కాలాబురాగ్‌-బీదర్‌ డెమూ, (నెంబర్‌: 07763) బీదర్‌-కాలాబురాగ్‌ డెమూ, (నెంబర్‌: 07791) కాచిగూడ-నడికుడి డెమూ, (నెంబర్‌: 07792) నడికుడి-కాచిగూడ రైళ్లను ఈనెల 23వ తేదీన రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-01-21T15:42:53+05:30 IST