మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కాల్పులపై రఘునందన్‌రావు స్పందన

ABN , First Publish Date - 2022-08-14T17:07:45+05:30 IST

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కాల్పులపై రఘునందన్‌రావు స్పందన

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కాల్పులపై రఘునందన్‌రావు స్పందన

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బహిరంగంగా కాల్పులు జరిపారని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఏ చట్టం మంత్రి కాల్పులు జరిపేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇవ్వమని ఏ చట్టంలో ఉంది? అని ప్రశ్నించారు. ఏచట్టంలో ఉందో ఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి కేసులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నివేదిక ఇవ్వాలని చెప్పి డీజీపీ చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి గన్‌ లైసెన్స్‌ ఉందా?, గన్‌ గురితప్పి ఉంటే ప్రమాదమే జరిగేదన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఫైర్‌ చేసిన గన్‌ను ఇంతవరకూ ఎందుకు సీజ్‌ చేయలేదు? అని ప్రశ్నించారు. 


Updated Date - 2022-08-14T17:07:45+05:30 IST