జూన్ 25న బ్లాక్ డే.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినం: Raghunandan

ABN , First Publish Date - 2022-06-25T17:54:20+05:30 IST

జూన్(June) 25న బ్లాక్ డే అని.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) పేర్కొన్నారు.

జూన్ 25న బ్లాక్ డే.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినం: Raghunandan

Siddipet : జూన్(June) 25న బ్లాక్ డే అని.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు(MLA Raghunandan Rao) పేర్కొన్నారు. నేడు తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిర్బంధాల మధ్య దిన పత్రికలు నడిపిన చీకటి రోజుల(Black days)ని.. 21 నెలల ఎమర్జెన్సీని పారద్రోలి మళ్ళీ ప్రజాస్వామ్యా(Democracy)న్ని పునరుద్ధరించామన్నారు. నాటి నిర్బంధం ఎలా ఉందో ఈ రోజు తెలంగాణ(Telangana)లో అదే పరిస్థితి ఉందన్నారు. ఒక గిరిజనురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటివరకూ కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎలాగైతే ప్రజామ్యం గొంతు నులిమి, నియంత పాలన సాగించాలని కోరుకుందో.. నేడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు, పోలీస్ పాలన తప్ప మరేమీ లేదన్నారు. తెలంగాణోద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి, పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. తమ కుటుంబ పాలన సాగించాలనే దుర్మార్గపు ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. వీరి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదని రఘునందన్ పేర్కొన్నారు.

Updated Date - 2022-06-25T17:54:20+05:30 IST