మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-03-05T06:01:47+05:30 IST

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌

ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ 


ఏకశిలనగర్‌ (వరంగల్‌), మార్చి 4 : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళాబంధు కార్యక్ర మా న్ని మూడురోజుల పాటు చేపట్టాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ నియోజకవర్గ మహిళలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఖమ్మం రోడ్డు ఇసుక అడ్డా జంక్షన్‌లోని ఓ గార్డెన్‌లో కార్పొరేటర్‌లు, మహిళ నాయకులు, ఆర్పీలు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్‌లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకల్లో భాగం గా 6న ఆడబిడ్డలు కేసీఆర్‌కు రాఖీకట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమవుతాయ న్నారు. ఇ దే రోజున పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలి గిన విద్యార్థులు, ఆశావర్కర్‌లు, ఏఎన్‌ఎంలు, స్వయం సహాయక సంఘాల మహిళ లీడర్‌లకు గౌరవపూర్వ క సన్మానం, కేసీఆర్‌ కిట్‌, షాదీ ముబారక్‌, థాంక్యూ కేసీఆర్‌ పేరుతో మానవహారాల ఏర్పాటు నిర్వహిస్తా మన్నారు. 7న కల్యాణ లక్ష్మి, కేసీఆర్‌ కిట్‌లను నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి  కలవడం, వారితో సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 8న నియోజక వర్గ స్థాయి మహిళలతో సమావేశం పెద్దఎత్తున మహిళ దినోత్సవ సంబరాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్ర మంలో డిప్యూటీ మేయర్‌ రిజ్వానా షమీమ్‌ మసూద్‌ కార్పొరేటర్‌లు మహిళా నాయకులు పాల్గొన్నారు. 


మురికి వాడలను అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే

శంభునిపేట: మురికివాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు.  నగరంలోని 37వ డివిజన్‌ గిరిప్రసాద్‌నగర్‌, బుడిగజంగాల కాలనీ, మోయిన్‌పుర, ఎంఎం నగర్‌ కాలనీల్లో సమస్యల అధ్యయనం కొరకు శుక్రవారం ఎమ్మెల్యే కార్పొరేటర్‌ సువర్ణసురే్‌షలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిదీపాలు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పోశాల స్వామి, బైరబోయిన దామోదర్‌ యాదవ్‌, సంగరబోయిన విజయ్‌, ఎమ్డీ ఉల్ఫత్‌, సింగారపు ఏలియా, పస్తం భిక్షపతి, తూర్పాటి రాజారామ్‌, ఫెరోజ్‌, అధికారులు కృష్ణమూర్తి, సంపత్‌, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:01:47+05:30 IST