బీజేపీ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-07-04T21:10:08+05:30 IST

బీజేపీ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిఅన్నారు. ఎలాంటి తీర్మానాలు లేకుండా సభ ముగించేశారని ఎద్దేవా చేశారు.

బీజేపీ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: బీజేపీ సమావేశాలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిఅన్నారు. ఎలాంటి తీర్మానాలు లేకుండా సభ ముగించేశారని ఎద్దేవా చేశారు.బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలకు ఏ హామీలు ఇస్తారని ఆయన ప్రశ్నించారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలంతా డబుల్ ఇంజన్ అని మాట్లాడుతున్నారు.ఉన్న సింగిల్ ఇంజనే సరిగా పనిచేయట్లేదని విమర్శించారు. కాగా టి.కాంగ్రెస్‌లో పరిణామాలపై సోనియాను కలుస్తామని జగ్గారెడ్డి తెలిపారు.ప్రస్తుతం నేను ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు.నేను ఏం మాట్లాడినా పార్టీ మంచి కోసమేనని ఆయన వ్యాఖ్యానించారు.పార్టీ లైన్‌లోనే ఉంటా.. నేను ఎక్కడికీ పోనని స్పష్టం చేశారు.ఒకవేళ నేను పోవాలి అనుకుంటే నన్ను ఆపేదెవరు?అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Read more