ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-23T05:50:45+05:30 IST

ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం

 ఐనవోలు, ఫిబ్రవరి 22: ప్రభుత్వ విద్యావిధానాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. 44వ డివిజన్‌ పరిధిలోని సింగారం ప్రభుత్వ పాఠశాలలో రూ.10 లక్షలతో ప్రహరీ, వంటగది నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటయ్యాక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పిస్తుండడం వల్ల పేద మద్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జలగం అనిత రంజిత్‌, ఇండ్ల నాగేశ్వర్‌రావు, సొసైటీ చైర్మన్‌ వనంరెడ్డి, జడ్పీ, మండల కో ఆప్షన్‌లు ఉస్మాన్‌అలీ,గుంషావళి, దేవస్థానం కమిటీ సభ్యుడు ఎం.సంపత్‌కుమార్‌, నాయకులు కంకణాల సంపత్‌రెడ్డి, పల్లకొండ సరేష్‌, విజయభాస్కర్‌, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

Read more