నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-01-24T04:34:28+05:30 IST

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌

వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ 


వర్ధన్నపేట, జనవరి 23: మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.అభివృద్ధి  పనుల్లో తప్పనిసరిగా నాణ్యత ప్రమాణా లు పాటించాలని సూచించారు.  సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, ఎంపీపీ అప్పారావు, పీఏసీఎస్‌ చై ర్మన్‌ కౌడగాని రాజే్‌షఖన్నా, మునిసిపల్‌ చైర్మన్‌ ఆంగోతు అరుణ పాల్గొన్నారు. 

Read more