నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన

ABN , First Publish Date - 2022-03-05T12:47:37+05:30 IST

నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ పైలెట్ ప్రాజెక్ట్‌కు

నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన

వరంగల్: నేడు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌ పర్యటించనున్నారు. ములుగు జిల్లాలో ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ పైలెట్ ప్రాజెక్ట్‌కు మంత్రి హరీష్‌రావు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం ములుగు జిల్లా ఆస్పత్రి నూతన భవనానికి శంకుస్థాపన చేసి.. ఏరియా హాస్పిటల్లో రేడియాలజీ ల్యాబ్, పీడియాట్రిక్ యూనిట్‎ను ప్రారంభించనున్నారు. నర్సంపేటలో 200, పరకాలలో 100 పడకల హాస్పిటల్‌కి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం నర్సంపేట బహిరంగసభలో మంత్రులు హరీష్‌, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు.

Read more