మేడారం జాతరకు వచ్చిన బిజెపి నేతలు రాజకీయాలుచేయడం దారుణం

ABN , First Publish Date - 2022-02-19T21:47:05+05:30 IST

ప్రజలు పవిత్రంగా చూసే ' గుడి', బడి లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం బీజేపీ కి అలవాటుగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ విమర్శించారు

మేడారం జాతరకు వచ్చిన బిజెపి నేతలు రాజకీయాలుచేయడం దారుణం

మేడారం: ప్రజలు పవిత్రంగా చూసే ' గుడి', బడి లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం బీజేపీ కి అలవాటుగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ విమర్శించారు. ప్రజల సెంటి మెంటుతో రాజకీయాలు అవసరమా?పవిత్రమైక గిరిజన జాతర, అద్భుతమైన ఆదివాసీల జాతర మేడారంలో కూడా బీజేపీ నేతలు రాజకీయాలు మాట్లాడడం దారుణమని అన్నారు. అత్యత భక్తి శ్రద్ధలతో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఏడాదిగా మేడారం మహాజాతర ఏర్పాట్లు చేస్తున్నం. ఏనాడూ మేము రాజకీయాలు మాట్లాడలేదు. కానీ ఇప్పడు బీజేపీ నేతలు జాతర ప్రాంగణంలో చేసిన విమర్శలకు సమాధానం ఇవ్వడం బాధ్యతగా భావించి మాట్లాడుతున్నామని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ మేరకు వారు శనివారం మేడారం మీడియా పాయింట్ లో విలేకరులతో మాట్లాడారు.ప్రజల, ప్రత్యేకించి ఆదివాసీల మనోభావాలు, ఆచార, సంప్రదాయం ప్రకారం జాతరను విజయవంతం చేయడంపై దృష్టి పెట్టాం. చుట్టపు చూపుగా దర్శనం కోసం వచ్చి రాజకియాలు చేస్తారా?బీజేపీ వైఖరి కారణంగా... విధిలేక మేం రాజకీయాలు మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని అని మంత్రులు అన్నారు.


పవిత్ర స్థలంలో రాజకీయాలకు తావు లేదు. అయినా మీడియా ద్వారా బీజేపీ వైఖరిని, కేంద్ర ప్ర భుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర నిధులతో ఇదే బీజేపీ కుంభమేళాను నిర్వహిస్తున్నది. 325 కోట్లు కేటాయిస్తున్నది. కుంభ మేళా స్థాయి మేడారం జాతర  ఏమి పాపం చేసింది? ఆదివాసీల జాతర అవడం వల్లే బీజేపీ మేడారం కు నిధులు ఇవ్వడం లేదా? జాతీయ పండుగగా ప్రకటించడం లేదా? అని మంత్రులు ప్రశ్నించారు.కేవలం మొక్కుబడిగా 2 కోట్లు 50 లక్షలు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. మేడారం జాతరను జాతీయ పండుగ'గా ప్రకటిస్తామన్నారు ప్రకటించారా? తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ అన్నారు ఇచ్చారా!జూకారం వద్ద స్థలాన్ని కేటాయించాం ఏండ్లు గడుస్తున్నాయి. యూనివర్సిటీ  జూడేది? ఆంధ్రాలో క్లాసులు నిర్వహిస్తున్నారు. 784 కోట్లు కేటాయించారు. వాళ్ళు 1058 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మా గిరిజన బిడ్డలు మీకు కనిపించడం లేదా? మా జాతర జాతరలాగా అనిపించడం లేదా?తెలంగాణ అన్నా, తెలంగాణ ప్రజలు అన్నా మీకు లెక్కలేదు.ఇంత నిర్లక్ష్యం, వివక్ష చూపిస్తారా? అని మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read more