మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో బోనం సమర్పించిన మంత్రి Talasani

ABN , First Publish Date - 2022-07-15T18:45:42+05:30 IST

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు శుక్రవారం ఉదయం పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో బోనం సమర్పించిన మంత్రి Talasani

హైదరాబాద్: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు శుక్రవారం ఉదయం పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ (Srinivas yadav) కుటుంబ సభ్యులు బంగారు బోనంతో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు అలరించాయి. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చైర్మన్‌లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Read more