Talasani srinivas: దేశంలో వైభవంగా హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర
ABN , First Publish Date - 2022-09-09T17:00:04+05:30 IST
దేశంలో హైదరాబాద్ వినాయక నిమజ్జన శోభాయాత్ర వైభవంగా జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్: దేశంలో హైదరాబాద్ వినాయక నిమజ్జన (Ganesh immersion) శోభాయాత్ర వైభవంగా జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. నగరవ్యాప్తంగా 38 వేల వినాయకులను ఏర్పాటు చేశారని.. మండపాల నిర్వాకులు అధికారులతో సహకరిస్తున్నారన్నారు. ఖైరతాబాద్ వినాయకుని శోభయాత్ర ప్రారంభమైందని చెప్పారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో నిమజ్జనం చేస్తున్నామని అన్నారు. వర్షం వల్ల నిమజ్జనం కొంచెం ఆలస్యం అవుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.