తెలంగాణలో బీజేపీ గెలవదు: మంత్రి Satyavati

ABN , First Publish Date - 2022-07-04T20:39:53+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ గెలవదని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

తెలంగాణలో బీజేపీ గెలవదు: మంత్రి Satyavati

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ (BJP) గెలవదని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavati rathod) స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... మరో మారు విజయసభ పెట్టుకోలేమని ముందే పెట్టుకున్నారని యెద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ రెండో స్థానానికి పరిమితం కావడం కూడా గొప్పే అని అన్నారు. ఒక ఆదివాసీ మహిళకు మంచి చేస్తే అందరి కపుడు నిండదని... ద్రౌపది మూర్ము (Draupadi Murmu) పీఎం అయితే ఆదివాసీలకు ఒరిగేది ఏముందని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కళ్ళు ఉండి చూడలేని కబోదులని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం (Kaleshwaram)లో అవినీతి జరుగుతుంది అనుకుంటే ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. కుటుంబ పాలన అని కేటీఆర్ (KTR), కేసీఆర్ (KCR) మీద ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-04T20:39:53+05:30 IST