మంత్రి సత్యవతికి చేదు అనుభవం.. అడ్డుకున్న సొంత పార్టీ నేతలు..

ABN , First Publish Date - 2022-09-20T18:08:37+05:30 IST

మంత్రి సత్యవతి రాథోడ్‌ (Minister Satyavathi Rathod)కు చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా(Mulugu district) పర్యటనకు

మంత్రి సత్యవతికి చేదు అనుభవం.. అడ్డుకున్న సొంత పార్టీ నేతలు..

Mulugu : మంత్రి సత్యవతి రాథోడ్‌ (Minister Satyavathi Rathod)కు చేదు అనుభవం ఎదురైంది. ములుగు జిల్లా(Mulugu district) పర్యటనకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్‌ను టీఆర్ఎస్ (TRS) దళిత విభాగం నాయకులు అడ్డుకున్నారు. ములుగు గడ్డ పైన అడుగు పెట్టొద్దు అని నినాదాలు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్ళు పట్టుకొని దళితుల కోసం న్యాయం చేయాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్(ZP chairman Kusuma Jagadish) వేడుకున్నారు. ఎంపీ కవిత (MP Kavitha) కార్యకర్తలకు ఏమి చేసిందంటూ ప్రశ్నించారు. మంత్రులు.. ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka)కు వత్తాసు పడటం ఏంటని నిలదీశారు. రహస్య ఒప్పందాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్క చెయ్యకుండా నిరసన తెలిపారు.

Updated Date - 2022-09-20T18:08:37+05:30 IST