తెలంగాణలో బడులు తెరిచేది ఎప్పటి నుంచో చెప్పేసిన విద్యా శాఖ మంత్రి

ABN , First Publish Date - 2022-06-12T22:17:38+05:30 IST

తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు(schools) ప్రారంభమవుతున్నాయి. సెలవులను పొడిగించేందని లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabita reddy) స్పష్టం చేశారు.

తెలంగాణలో బడులు తెరిచేది ఎప్పటి నుంచో చెప్పేసిన విద్యా శాఖ మంత్రి

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి పాఠశాలలు(schools) ప్రారంభమవుతున్నాయి. సెలవులను పొడిగించేందని లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(sabita reddy) స్పష్టం చేశారు.కరోనా భయంతో పాఠశాలల ప్రారంభంజాప్యం అవుతుందన్న వార్తలను మంత్రి తోసిపుచ్చారు. కరోనా నిబంధనలతో క్లాసుల నిర్వహణ జరుగుతుందని మంత్రి సబిత స్పష్టం చేశారు. శానిటేషన్ ఇబ్బందులు లేకుండా స్థానిక నేతలు చూడాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన వుంటుందని మంత్రి సబిత తెలిపారు.


యథావిధిగా బుక్స్,యూనిఫాం అందిస్తామని చెప్పారు.విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కోరారు.వారానికి ఒకసారి పాఠశాలకు వెళ్లి టీచర్లతో మాట్లాడాలన్నారు. మన ఊరు- మన బడికి కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి సబితారెడ్డి ఆరోపించారు.విద్యారంగంలో సమూల మార్పులకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా టెట్‌పై బీజేపీ ద్వంద వైఖరి అవలంభిస్తోందని మంత్రి సబిత పేర్కొన్నారు. 20 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకే టెన్ నిర్వఃహించామన్నారు.విద్య విషయంలో రాజకీయాలు చేయవద్దని మంత్రి మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. 

Read more