Minister సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్న NSUI నాయకులు
ABN , First Publish Date - 2022-06-10T18:05:31+05:30 IST
మీర్‌పేట రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని

రంగారెడ్డి: మీర్పేట్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు. దీంతో మీర్పేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్పేట్ స్టేషన్‌కు తరలించారు.