ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త: KTR

ABN , First Publish Date - 2022-06-24T19:57:38+05:30 IST

రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్తగా వచ్చేదని.. ఇప్పుడు పోతే వార్త అవుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు.

ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్త.. ఇప్పుడు పోతే వార్త: KTR

సిరిసిల్ల: రాష్ట్రంలో ఒకప్పుడు కరెంట్ ఉంటే వార్తగా వచ్చేదని.. ఇప్పుడు పోతే వార్త అవుతోందని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కోసం ఇబ్బందులు పడ్డామని గుర్తుచేశారు. దేశంలో రైతులను ఆదుకున్నది ఒక్క తెలంగాణ సర్కార్ మాత్రమే అని స్పష్టం చేశారు. రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని కుల సంఘాలకు భూములు ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-24T19:57:38+05:30 IST