ప్రగతిభవన్‌కు చేరిన Rangareddy జిల్లా పంచాయితీ

ABN , First Publish Date - 2022-07-16T16:50:44+05:30 IST

రంగారెడ్డి టీఆర్ఎస్(TRS) పార్టీలో నెలకొన్న ప్రోటోకాల్ పంచాయతీ ప్రగతి భవన్‌కు చేరింది.

ప్రగతిభవన్‌కు చేరిన Rangareddy జిల్లా పంచాయితీ

హైదరాబాద్‌: రంగారెడ్డి టీఆర్ఎస్(TRS) పార్టీలో నెలకొన్న ప్రోటోకాల్ పంచాయతీ ప్రగతి భవన్‌కు చేరింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి (Sunita mahendar reddy) ప్రోటోకాల్ పాటించడం లేదంటూ మర్పల్లిలో  వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ (Anand) వర్గం అడ్డుకుంది. కావాలనే ఎమ్మెల్యే ఆనంద్ తనపై దాడి చేయించారని సునీతా రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌తో పాటు ఎస్పీకి సునీత ఫిర్యాదు చేశారు. పోటాపోటీగా మీడియా సమావేశం నిర్వహించాలని  ఎమ్మెల్యే, సునీతా వర్గం నిర్ణయించింది. అయితే అధిష్టానం ఆదేశంతో ఇరువర్గాలు మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో పట్నం మహేందర్‌రెడ్డి కుటుంబం, ఎమ్మెల్యే ఆనంద్‌, ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వచ్చారు. పార్టీ పేరును బద్నాం చేయవద్దని నేతలను  మంత్రి కేటీఆర్‌ హెచ్చరించనట్లు తెలుస్తోంది. 

Read more