Minister KTR: 8 ఏళ్లు గుర్తు రాని సెప్టెంబర్ 17 ఈరోజే గుర్తొచ్చిందా..

ABN , First Publish Date - 2022-09-16T19:42:45+05:30 IST

సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్న బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Minister KTR: 8 ఏళ్లు గుర్తు రాని సెప్టెంబర్ 17 ఈరోజే గుర్తొచ్చిందా..

హైదరాబాద్: సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహిస్తున్న బీజేపీ (BJP)పై మంత్రి కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... 8 ఏళ్లుగా గుర్తురాని సెప్టెంబర్ 17 ఈరోజే గుర్తొచ్చిందా అని మండిపడ్డారు. కేంద్రమంత్రి అమిత్ షా (Amith shah) వస్తే.. ఓ పది వేల కోట్లు అయినా తెచ్చే దమ్ముందా అని అన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్లే ఉంది.. బీజేపీ నేతల (BJP Leaders) తీరు అని వ్యాఖ్యలు చేశారు. నాలుగు ఓట్ల కోసమే చిల్లర గాళ్ల లొల్లి అని అన్నారు. పాత గాయాలను గెలకడమే బీజేపీ లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత తెలంగాణ (Telangana)లో కులం, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారన్నారు. మత పిచ్చితో తెలంగాణను విడదీయాలని అనుకుంటున్నారని ఆరోపించారు. దుర్మార్గపు, అరాచకపు వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిచ్చి మాటలు, పనికి మాలిన ముచ్చట్లు తప్ప ఏమీ చేయడం లేదన్నారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టే చిల్లర నాయకులను నమ్మొద్దని మంత్రి కేటీఆర్ (Telangana minister) అన్నారు. 

Read more