వైఫల్యాల చరిత్ర బీజేపీది: కేటీఆర్

ABN , First Publish Date - 2022-04-27T22:07:13+05:30 IST

దేశానికి టెలివిజన్ నాయకుడు కాదని, విజన్ ఉన్న నాయకుడు కావాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు

వైఫల్యాల చరిత్ర బీజేపీది: కేటీఆర్

హైదరాబాద్: దేశానికి టెలివిజన్ నాయకుడు కాదని, విజన్ ఉన్న నాయకుడు కావాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుత సమయంలో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని అన్నారు. బుధవారం టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు దేశాన్ని పాలిస్తున్న బిజెపికి వైఫల్యాల చరిత్ర అని అన్నారు. రైతులను ఫణంగా పెట్టి మోదీ రైతు చట్టాలను తెచ్చారని చెప్పారు.మోదీ రైతు విరోధి అని రైతులే అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.2022 కల్లా బుల్లెట్ రైలు తెస్తామని.. ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు.డబుల్ ఇంజిన్ అంటే ఏంటో అనుకున్నాం కానీ దేశ ప్రజల కష్టాలను డబులు చేస్తారనుకోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 


Updated Date - 2022-04-27T22:07:13+05:30 IST