వయోవృద్ధుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి: Koppula

ABN , First Publish Date - 2022-06-15T23:39:20+05:30 IST

వయో వృద్ధుల భద్రత,సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar) చెప్పారు.

వయోవృద్ధుల భద్రత, సంక్షేమం, హక్కుల పరిరక్షణకు కృషి: Koppula

హైదరాబాద్: వయో వృద్ధుల భద్రత,సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula eshwar) చెప్పారు. బుధవారం ప్రపంచ వయో వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉప్పల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ,వృద్ధుల సంరక్షణకు ప్రభుత్వ ఆధ్వర్యంలో రంగారెడ్డి, కరీంనగర్ లలో 2 ఆశ్రమాలు నడుస్తున్నాయని,మరో 11మంజూరు చేశామని తెలిపారు.


సేవా దృక్పథంతో నడిపిస్తున్న ఆశ్రమాలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.రాష్ట్రంలో  2వేల700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సుమారు 11లక్షల మందికి ప్రతి నెల రూ.2వేల 16చొప్పున అందజేస్తున్నామని కొప్పుల వివరించారు.వృద్ధుల హక్కుల పరిరక్షణకు 2007లో చేసిన చట్టాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని తెలిపారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అసోసియేషన్ ప్రముఖులు నర్సింహారావు,వెంకటయ్య గౌడ్, నర్సింహారెడ్డి, ప్రతాపరెడ్డి,నర్సయ్య,హరి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


వెబ్ సైట్ ను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల

వృద్ధుల భద్రత, హక్కుల పరిరక్షణ భాగంగా వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు,వృద్ధుల ఆర్థిక సహకార సంస్థ రూపొందించిన వెబ్ సైట్ (www tsseniorcitizens.cgg.gov.in )పోస్టరును మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు.తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, వృద్ధుల హక్కుల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జాతీయ వయో వృద్ధుల హెల్ప్ లైన్ 14567,దివ్యాంగుల హెల్ప్ లైన్ 1800-572-8980 టోల్ ఫ్రీ నంబర్ల పనితీరును గురించి ప్రభుత్వ కార్యదర్శి దివ్యా దేవరాజన్,సహకార ఆర్థిక సంస్థ కమిషనర్ శైలజలు మంత్రికి వివరించారు.

Updated Date - 2022-06-15T23:39:20+05:30 IST