టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది: కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2022-07-03T21:33:08+05:30 IST
ఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో వుందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎంఐఎం చెప్పిందే సీఎం కేసీఆర్ చేస్తున్నారని అన్నారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి టీఆర్ఎస్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ప్రగతిభవన్‌లోకి మంత్రులకు సైతం ప్రవేశం లేదని అన్నారు. కానీ ఎంఐఎం నేతలు మాత్రం సీఎం దగ్గరకు నేరుగా వెళ్తారన్నారు. కేసీఆర్ నెలలో 20 రోజులు ఫాం హౌస్‌లోనే ఉంటారు. ఇక పాలన ఎలా చేస్తారన్నారు.
ఐదేళ్లు కేబినెట్లో ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. బిజెపి పై అక్కసుతోనే బీజేపీ ఫ్లెక్సీలను కావాలని తొలగించారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.బీజేపీ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు వేశారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై నామమాత్రపు ఫైన్లు వేశారని చెప్పారు. ఇంత చౌకబారు రాజకీయాలు మేము ఎన్నడూ చూడలేదని కిషన్ రెడ్డి అన్నారు. ఓవైసీ, కేసీఆర్ ఇద్దరూ తెలంగాణను దోచుకుంటున్నారని మంత్రి ఆరోపించారు.
తెలంగాణ సర్కార్ ఎలా పనిచేస్తుందో రెండ్రోజులుగా ప్రజలు గమనిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. 8 ఏళ్లుగా సచివాలయానికి సీఎం కేసీఆర్ రానేలేదు.సచివాలయానికి రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరేనని విమర్శించారు.వాస్తు పేరుతో సచివాలయం కూలగొట్టి వందల కోట్లు వృథాచేశారని కిషన్ రెడ్డిఆరోపించారు.