వాతావరణ మార్పులపై మరిన్ని పరిశోధనలు జరగాలి: మంత్రి అల్లోల
ABN , First Publish Date - 2022-01-20T21:26:42+05:30 IST
కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈపీటీఆర్ఐ రూపొందించిన క్యాలెండర్ -2022 ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. "గ్రీన్ ఇన్షియేటివ్స్" అనే ఇతివృత్తంతో పాటు ప్రతి నెల జరుపుకునే ముఖ్యమైన పర్యావరణ దినోత్సవాల ఆవశ్యకతను ఈ క్యాలెండర్లో పొందుపరిచినట్లు పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్ఐ) డైరెక్టర్ జనరల్ అధర్ సిన్హా మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమతుల్య వాతావరణం కోసం, వాతావరణ మార్పులకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఇచ్చే విధంగా ఈపీటీఆర్ఐ పరిశోధనలు చేయాలన్నారు. ఉష్ణోగ్రతలు పెంచే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ల విడుదలను నియంత్రించి భవిష్యత్ తరాలు ఈ భూమిపై అవనిపై సుఖంగా జీవించేలా ఆధ్యాయనాలు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యుత్ ఆదా, వనరుల పరిరక్షణ ద్వారా సమకూరే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎన్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.సునీలా పాల్గొన్నారు.