వెల్‌లోకి వస్తే సస్పెండ్: మంత్రి హరీష్‌రావు
ABN , First Publish Date - 2022-03-07T21:26:30+05:30 IST
వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని

హైదరాబాద్: వెల్‌లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియాతో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్‌లోకి వచ్చారు కాబట్టే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి రాలేదు కాబట్టే.. వారిని సస్పెండ్ చేయలేదన్నారు. తమ స్థానంలో నిలబడి అడిగితేనే పార్లమెంట్లో సస్పెండ్ చేస్తున్నారన్నారు. ఢిల్లీకి ఒక న్యాయం..రాష్ట్రానికి ఒక న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. సస్పెండ్ అవ్వాలనే కోరకతోనే వెల్‌లోకి బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చారని ఆయన పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ స్పీచ్ వేళ వెల్‌లోకి రావొద్దని ఆయన తెలిపారు.