సంజీవనిలా ప్రభుత్వ దవాఖానాలు: మంత్రి హరీష్

ABN , First Publish Date - 2022-01-30T00:33:37+05:30 IST

రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలు సంజీవనిలా పనిచేస్తున్నాయని ఆరోగ్యశాఖా

సంజీవనిలా ప్రభుత్వ దవాఖానాలు: మంత్రి హరీష్

సూర్యాపేట: రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానాలు సంజీవనిలా పనిచేస్తున్నాయని ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు అన్నారు. పట్టణంలో పలు పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనికత కారణంగానే దవాఖానాలు సంజీవనిలా పనిచేస్తున్నాయన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డి చొరవతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయన్నారు. సూర్యాపేట మెడికల్ కళాశాల భవనం పూర్తయిందని, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బడా కాంగ్రెస్ నేతలున్నా జిల్లాకు చేసిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. సమైక్య పాలనలో మెడికల్ కళాశాలల కోసం చెయ్యని ధర్నాలు, ఆందోళనలు లేవని అన్నారు.


సీఎం కేసీఆర్ పాలనలో 18 మెడికల్ కళాశాలలు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. నల్లగొండ, సూర్యాపేటలలో అత్యాధునిక సౌకర్యాలతో 1800 పడకల ఆసుపత్రులు నిర్మించామన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సూచనలతో నల్లగొండలో 5, సూర్యాపేటలో 5 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు  చేశామన్నారు. ఇకపై మూడు షిఫ్ట్‌లలో డయాలసిస్ సేవలు అందుతాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2022-01-30T00:33:37+05:30 IST