ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

ABN , First Publish Date - 2022-03-05T20:38:04+05:30 IST

తెలంగాణలో ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

ములుగు జిల్లాలో హెల్త్ ప్రొఫైల్ ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు

ములుగుజిల్లా: తెలంగాణలో ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంఅన్న నినాదంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. శనివారం జిల్లాలో జిల్లా హెల్త్ ప్రొఫైల్ ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు.అలాగే జిల్లా దవాఖనాకు కూడా శంకుస్థాపన చేశారు. ములుగు ఏరియా హాస్పిటల్ లో రేడియాలజీ లాబ్, పిడియాట్రిక్ యూనిట్ కు కూడా మంత్రి హరీశ్ రావు శంకుస్ధాపన చేశారు. మంత్రి వెంట రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చైర్మన్లు వున్నారు. ఈ సందర్భంగా జాకారం వద్ద గట్టమ్మ దేవాలయంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. 


Read more