అర్హులందరికీ బూస్టర్ డోస్: మంత్రి హరీశ్ రావు

ABN , First Publish Date - 2022-01-29T21:09:37+05:30 IST

రాష్ట్రంలోకోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతెలిపారు.

అర్హులందరికీ బూస్టర్ డోస్: మంత్రి హరీశ్ రావు

ఖమ్మం: రాష్ట్రంలోకోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావుతెలిపారు. వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా అర్హులైన వారందరికీ బూస్టర్ డోస్ ఇస్తున్నామని తెలిపారు. సత్తుపల్లిలో 100శాతం కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.జిల్లాలోని సత్తుపల్లిలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు శనివారం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి శంకుస్ధాపన చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రానికి డయాలసిస్ కేంద్రం, ఐసీయూ వార్డులు తీసుకొచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలిపారు. 

Updated Date - 2022-01-29T21:09:37+05:30 IST