బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..
ABN , First Publish Date - 2022-10-18T04:55:55+05:30 IST
బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం..
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
పాత మగ్ధుంపురంలో బస్ షెల్టర్ ప్రారంభం
చెన్నారావుపేట, అక్టోబరు 17: బీసీలను చదువులతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సం క్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం మండలంలోని పాత మగ్ధుంపురం గ్రామంలో వేములపల్లి మొగి లి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో నూతనంగా నిర్మించిన బస్ స్టాండ్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బీసీలకు ఉన్నత విద్యాను అందించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను ఏర్పా టు చేయటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 330 గురుకుల విద్యాలయాల్లో 1.60లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం గతంలో లేని విధంగా కేసీఆర్ సంక్షేమ పథకాలను అందిస్తున్నరన్నారు. నియోజకవర్గంలో విద్యాభివృద్ధి కోసం నూతన గురుకులాలను మంజూరు చేయటం జరిగిందన్నారు. ప్రజలకు ఉపయోగ పడేలా బస్ షెల్టర్‌ను నిర్మా ణం చేసిన వేములపల్లి రాజును మంత్రి అభినందించారు.
ప్రజల కోసం బస్‌షెల్టర్ నిర్మాణం చేపట్ట డం అభినందనీయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. రాజు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి, ప్రజలకు సేవ అందించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, వైస్ ఎంపీపీ కంది కృష్ణారెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యుడు ఎండీ రఫీ, సర్పంచ్‌లు సుంకరి లావ ణ్య సాంబయ్య, కుండె మల్లయ్య, ఫౌండేషన్ అధినేత వేములపెల్లి రాజుకుమార్, హెల్పిండ్ హ్యాండ్స్ ప్రధాన కార్యదర్శి తూటి శ్రీనివాస్, సంతోష్ పాల్గొన్నారు.