Errabelli comments: బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు
ABN , First Publish Date - 2022-08-15T17:01:45+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.

జనగామ: బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) సంగ్రామ యాత్రపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli dayakar rao) స్పందించారు. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారని నిలదీశారు. ఎనిదేళ్లలో కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. బండి సంజయ్ నిధులు తీసుకొచ్చి మాట్లాడాలన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారని... దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు అంతటా నీరు అందించి సస్యశ్యామలం చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పుకొచ్చారు.