పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై నేడు భేటీ
ABN , First Publish Date - 2022-10-07T07:58:38+05:30 IST
పోలవరం బ్యాక్‌వాటర్ వరద ముంపుపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం న్యూఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది.
సీడబ్ల్యూసీ నేతృత్వంలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం
హైదరాబాద్, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం బ్యాక్‌వాటర్ వరద ముంపుపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) శుక్రవారం న్యూఢిల్లీలో నాలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. ఒడి శా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు లేవనెత్తిన సాంకేతిక అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా కేంద్రం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.