మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ బృందం పర్యటన

ABN , First Publish Date - 2022-02-23T06:08:06+05:30 IST

మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ బృందం పర్యటన

మెడికల్‌ ఇంటెలిజెన్స్‌ బృందం పర్యటన

వరంగల్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22: కేంద్ర ఆరోగ్య శాఖకు సంబం ధించి వివిధ పథకాలు వరంగల్‌ జిల్లాలో అమలు తీరుపై అధ్యయ నం చేయడానికి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ హెల్త్‌ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ బృందం మంగళవారం జిల్లాకు చేరుకుంది. రెండు రోజుల పాటు జిల్లాలోని ఆరోగ్య, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పనితీరును పరిశీలించను న్నారు. ఈమేరక మంగళవారం జిల్లా వైద ్యఆరోగ్య శాఖ కార్యాలయం లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కె.వెంకటరమణతో భేటీ అయ్యారు. సమావేశంలో కేంద్ర బృందానికి చెందిన టి.రామారావు, ఎస్‌. నర్దేశ్‌ ప్రసాద్‌, డాక్టర్‌ సుధార్‌సింగ్‌, డాక్టర్‌ పద్మశ్రీ, డాక్టర్‌ మ ధుసూదన్‌, డాక్టర్‌ ప్రకాష్‌, డాక్టర్‌ వాణిశ్రీ, డీపీవో అర్చన, విజయ లక్ష్మి, రామలింగయ్య, జ్ఞానసుందర్‌, ఇ.అనిల్‌కు మార్‌ పాల్గొన్నారు.


Read more