TS News: త్వరలో మెడికల్ కాలేజీ

ABN , First Publish Date - 2022-12-03T14:41:07+05:30 IST

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో

TS News: త్వరలో మెడికల్ కాలేజీ

కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. పిట్లం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 13 డయాలసిస్ సెంటర్లు ఉండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 112 సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామని, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 13 మెడికల్ కాలేజీలు ఉండగా.. ప్రస్తుతం 112 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. పోషకాహారం లోపంతో బాధపడుతున్న గర్భిణుల కోసం న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో కామారెడ్డి జిల్లా పిట్లం నుంచి ప్రారంభిస్తామన్నారు. దేశంలోనే మాతృ మరణాలను తగ్గించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు లక్షల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చి 1,50,000 ఉద్యోగాలు కల్పించామని, మిగతా ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామన్నారు.

Updated Date - 2022-12-03T14:41:08+05:30 IST