విద్యాలయాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-09-14T04:54:39+05:30 IST

విద్యాలయాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి

విద్యాలయాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచాలి
కేజీబీవీలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ శశాంక

కలెక్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):  విద్యాలయాల్లో పరిసరాలు, ఆవరణను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు  ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిం చాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. మహబూబాబాద్‌ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాలయ ఆవరణలో నిల్వ ఉన్న నీటిని వెంటనే  తొలగించి పరిశుభ్రత పను లు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. పరిసరాలు అపరి శుభ్రంగా ఉండడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకా శం ఉంటుందని, విద్యార్థినుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వ హించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. మరు గుదొడ్లను సక్రమంగా నిర్వహించాలని, నీటి సమస్య లే కుండా చూడాలన్నారు. డైనింగ్‌ హాల్‌, స్టోర్‌ రూం, టా యిలెట్లు, వంటగదులను పరిశీలించారు. స్టోర్‌ రూంలో ఆహార పదార్థాలను పరిశీలించి నిర్వహణ పట్ల తగు సూచనలు చేశారు. విద్యా లయ ఆవరణలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి బోధన, వసతుల కల్పనపై విద్యార్థినులను అడిగి తెలు సుకున్నారు. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షల్లో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థులు 10/10 గ్రేడ్‌ పాయింట్లు సాధించాలని చెప్పారు. అనంతరం క ళాశాలను సందర్శించి ఎంపీసీ, బైౖపీసీ విద్యార్థినులతో మాట్లాడారు. నీట్‌, ఏఐఈఈఈ పరీక్షలకు హాజరయ్యే విధంగా ఎంపీసీ, బైపీసీ వారికి ప్రత్యేక కోచింగ్‌ అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో అబ్థుల్‌హై, విద్యాలయ ప్రత్యేకాధికారి భవాని, తహసీల్దార్‌ నాగభవాని, మునిసిపల్‌ డీఈ ఉపేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-14T04:54:39+05:30 IST