ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ నోటిఫికేషన్‌

ABN , First Publish Date - 2022-10-11T09:08:48+05:30 IST

రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ నోటిఫికేషన్‌

నేటి నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు 

హైదరాబాద్‌, హనుమకొండ అర్బన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. వైద్య విద్య కోర్సుల ప్ర వేశాలకు గాను ఆన్‌లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వ విద్యాలయం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌ 2022లో అర్హత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ తెలిపింది. మంగళవారం నుంచి 18 సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.  ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhstelangana.gov.inను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి. 

Read more