Sad Incident: పాపం ఈవిడ.. పుట్టినరోజు కదా అని..

ABN , First Publish Date - 2022-08-07T21:29:20+05:30 IST

పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లి పూజలు చేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో..

Sad Incident: పాపం ఈవిడ.. పుట్టినరోజు కదా అని..

- లారీ ఢీకొని మహిళ మృతి

- భర్త, కూతురికి తీవ్ర గాయాలు


తిమ్మాపూర్‌: పుట్టిన రోజు సందర్భంగా గుడికి వెళ్లి పూజలు చేసుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం ఆ కుటుంబంలో విషాదం నింపింది. కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని అలుగునూర్‌ శివారులో లారీ ఢీకొట్టడంతో అనుపురం రమ(49) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త, కూతురికి తీవ్రగాయాలయ్యాయి. మానకొండూర్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన అనుపురం రమ తన పుట్టిన రోజు కావడంతో భర్త రాజమల్లుతో పాటు కూతురు ఆకాంక్షను తీసుకొని  ఎల్‌ఎండీ కాలనీలో గల శ్రీ తాపాలనృసింహస్వామి ఆలయానికి వెళ్లింది. ఆలయంలో పూజలు చేసి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతుండగా అలుగునూర్‌ శివారు వద్ద రాజీవ్‌ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. వెనుకాల కూర్చున్న అనుపురం రమ రోడ్డుపై పడి సంఘటన స్థలంలోనే మృతి చెందింది. రాజమల్లు, కూతురు ఆకాంక్షకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more