స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మానుకోట

ABN , First Publish Date - 2022-08-15T06:08:50+05:30 IST

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మానుకోట

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మానుకోట

గాంధీజీకి ఉంగరాన్ని తొడిగిన బీఎన్‌.గుప్తా

మహనీయుడి మరణం రోజునే ఆయన పేరిట పార్కు


మహబూబాబాద్‌ టౌన్‌, ఆగస్టు 14: భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మానుకోట సువర్ణ అక్షరాలతో తన పేరును లిఖించుకుంది. మహనీయుడు మహాత్మాగాంధీ ఉద్యమ నేపథ్యంలో నాగ్‌పూర్‌ నుంచి మద్రాస్‌కు వెళ్తున్న క్రమంలో మహబూబాబాద్‌ పట్టణానికి చెందిన యువకుడు బీఎన్‌.గుప్తా అప్పట్లోనే మహాత్మాగాంధీని చూసేందుకు రైల్వేస్టేషన్‌కు వెళి ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారు. ‘హరిజనోద్ధరణకు సాయం చేయండి’ అంటూ గాంధీ చేసిన అభ్యర్థనకు  కిక్కిరిసిన జనంలో ఉన్న పద్నాలుగేళ్ల బాలుడు బీఎన్‌.గుప్తాను స్పందించారు. వెంటనే తన వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని మహాత్ముడికి సమర్పించుకొని  ఆశీస్సులు పొందారు. నిలువెల్లా దేశభక్తి పరిఢవిల్లిన స్ఫూర్తిప్రదాత, స్వాతంత్య్ర సమరయోధుడు, నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్‌ నేత, అప్పటి కాంగ్రెస్‌ కరడుగట్టిన కార్యకర్త అయిన బీఎన్‌.గుప్తా స్వాతంత్రోద్యమ చరిత్రలో మహాత్మాగాంధీని కలుసుకుని తన ఉద్యమ స్ఫూర్తిని చాటారు.


16 డిసెంబరు 1933న మానుకోటలో గాంధీజీ..

మానుకోట ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త భువనగిరి సోమయ్య-కనకమ్మ దంపతుల తొలి సంతానంగా 24 ఫిబ్రవరి 1919న జన్మించిన భువనగిరి నారాౄయణగుప్తా(బీఎన్‌ గుప్తా) చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలతో ఎదిగారు. 16 డిసెంబరు 1933న జాతిపిత గాంధీజీ నాగ్‌పూర్‌ నుంచి రైలులో మద్రాసుకు వెళుతూ మానుకోట రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు ఆగిన రైలు లోపటి నుంచే అందరికి అభివాదం చేశారు. ుహరిజనోద్ధరణకు సాయం చేయండి్‌ అంటూ బాపూజీ చేసిన అభ్యర్థనకు బీఎన్‌.గుప్తా తన చేతికి ఉన్న బంగారు ఉంగరాన్ని తీసి గాంధీజీ వేలికి తొడిగి జాతీయ భావాన్ని చాటుకున్నారు. ఆనాటి నుంచి మహాత్మాగాంధీ ఆదర్శాల ముద్రతో బీఎన్‌.గుప్తా ఖద్దరు వస్త్రాలు, టోపిని ధరించడం అలవాటు చేసుకున్నారు. నాడు స్వాతంత్రోద్యమ కేసులు పెట్టినా.. ఆయన ఆస్తులు ధ్వంసం చేసినా కుంగిపోని బీఎన్‌.గుప్తా 1947 ఆగస్టు 15న మానుకోట పట్టణ కాంగ్రెస్‌ కమిటీ కార్యాౄలయంపై తివర్ణ పతాకం ఎగురవేసినందుకు నిజాం పోలీౄసులు అరెస్టు చేశారు. పట్టణాన్ని విడిచి వెళ్లాౄలని ఉత్తర్వులు జారీ చేశారు.


మహాత్ముడి మరణం రోజునే గాంధీ పార్కు

అహింసా మార్గంలో బ్రిటిష్‌ వారిని ఎదురించి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు గాంధీజీ మరణం రోజునే మానుకోట పట్టణంలో ఆయన పేరిట గాంధీ పార్కును ఏర్పాటు చేశారు. మహనీయుడి మరణ వార్త విన్న వెంటనే రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఖాళీ ప్రదేశాన్ని గాంధీ పార్కుగా నామకరణం చేశారు. అంతటితో ఆగకుండా అక్కడ గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహనీయుడి వర్ధంతి, జయంతి రోజున పుష్పగుచ్ఛాలుంచి నివాళులు అర్పించడంతో పాటు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుం టున్నారు. అలా స్వాతంత్రోద్యమ ఘట్టంలో గాంధీజీ మానుకోటలో ఆగిన నాటి జ్ఞాపకాలు ఇప్పటికి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచాయి.



Updated Date - 2022-08-15T06:08:50+05:30 IST