కాఫీ టేబుల్‌ బుక్‌లో మనోళ్ల చిత్రాలు

ABN , First Publish Date - 2022-12-07T23:52:38+05:30 IST

దివ్యాంగ విద్యార్థుల్లోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటే లక్ష్యంతో ముద్రించిన ఇంటర్నేషనల్‌ లెవల్‌ కాఫీ టేబుల్‌ బుక్‌లో జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు అనిల్‌కుమా ర్‌, అరవింద్‌ గీసిన చిత్రాలకు చోటు లభించింది. కరోనా లాక్‌డౌన్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ లెవెల్‌ మిరాఖి’ చిత్రలేఖనం పోటీల్లో భువనగిరి భవితసెంటర్‌కు చెందిన ఈఇద్దరు విద్యార్థులు గీసిన చిత్రాలను ముద్రించారు.

కాఫీ టేబుల్‌ బుక్‌లో మనోళ్ల చిత్రాలు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 7: దివ్యాంగ విద్యార్థుల్లోని ప్రతిభను బాహ్య ప్రపంచానికి చాటే లక్ష్యంతో ముద్రించిన ఇంటర్నేషనల్‌ లెవల్‌ కాఫీ టేబుల్‌ బుక్‌లో జిల్లాకు చెందిన దివ్యాంగ విద్యార్థులు అనిల్‌కుమా ర్‌, అరవింద్‌ గీసిన చిత్రాలకు చోటు లభించింది. కరోనా లాక్‌డౌన్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్‌ లెవెల్‌ మిరాఖి’ చిత్రలేఖనం పోటీల్లో భువనగిరి భవితసెంటర్‌కు చెందిన ఈఇద్దరు విద్యార్థులు గీసిన చిత్రాలను ముద్రించారు. ఈ మేరకు కాఫీ బుక్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. విద్యార్థులతోపాటు ప్రోత్సహించిన ఐఆర్‌పీ ఎస్తేర్‌ రాణిని గవర్నర్‌ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్‌ జోసఫ్‌, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రేమలత, శ్రీను, గిరిజ, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:52:46+05:30 IST