చైతన్యపురిలో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి వ్యక్తి ఆత్మహత్య!
ABN , First Publish Date - 2022-03-06T01:23:00+05:30 IST
చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు...
హైదరాబాద్: చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రాజేందర్ రెడ్డి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. షాప్ యజమాని వెంటనే ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారని, అదే ప్లేస్‌లో ప్రస్తుతం వైన్స్ కిరాయికి ఇచ్చారని రాజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా యజమాని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు. తాను షాప్ తీసుకున్నాక పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నానని తెలిపారు. షాప్‌లో ఉన్న ఫర్నిచర్‌ను, తన వద్ద తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు రాజేందర్ సెల్ఫీ వీడియోలో చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.