BJP సమావేశాలు నిరుత్సాహపరిచాయి: మల్లు రవి

ABN , First Publish Date - 2022-07-04T22:00:38+05:30 IST

హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ (BJP) సమావేశాలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi) విమర్శించారు.

BJP సమావేశాలు నిరుత్సాహపరిచాయి: మల్లు రవి

హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ (BJP) సమావేశాలు నిరుత్సాహపరిచాయని కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi) విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గురించి ప్రధాని మాట్లాడటం సరికాదన్నారు. కర్ణాటక, ఎంపీ, మహారాష్ట్ర ప్రభుత్వాలను కూల్చారని తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తీస్తామనే సంకేతం ఇచ్చారని, ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. రాజకీయ తీర్మానంలో దేశాన్ని మత పరంగా విడదీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచాలనేది కాంగ్రెస్ యోచన అని మల్లు రవి తెలిపారు.

Read more