డ్రైనేజీ కావాలా..? వైకుంఠ దామాలా?: మల్లు రవి

ABN , First Publish Date - 2022-06-07T19:38:14+05:30 IST

పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం పుండు మీద కారం చల్లిన మాదిరిగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు

డ్రైనేజీ కావాలా..? వైకుంఠ దామాలా?: మల్లు రవి

హైదరాబాద్ : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం పుండు మీద కారం చల్లిన మాదిరిగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. పంచాయతీల్లో అప్పులు తీసుకొని పనులు చేశారన్నారు. ఇంత వరకూ బిల్లులు విడుదల చేయలేదన్నారు. చెక్కులను ఫ్రీజ్ చేసి బడ్జెట్ విడుదల చేయడం లేదన్నారు. కొంతమంది సర్పంచ్‌లు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..? అని మల్లు రవి నిలదీశారు. ఉపాధి హామీ పథకంలోని నిధులతో వైకుంఠ దామాలు నిర్మించారన్నారు. రోడ్లు, డ్రైనేజీ కావాలా..? లేదంటే వైకుంఠ దామాలు అవసరమా...? అని ప్రశ్నించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అన్ని పార్టీల నేతలు బాయ్‌కాట్ చేస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు.


Read more