ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-06-25T05:55:03+05:30 IST

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ధరణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

జిల్లా కలెక్టర్‌ శశాంక 

మహబూబాబాద్‌, జూన్‌ 24 (ఆంధ్ర జ్యోతి): ధరణి దరఖాస్తులు వెంటనే పరి ష్కరించాలని జిల్లా కలెక్టర్‌ శశాంక అధికా రులను ఆదేశించారు.  జిల్లా కలెక్టర్‌ తన చాంబర్‌లో ధరణి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీ క్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దరఖాస్తు చేసుకున్న వారంలోగా పరిష్క రించాలని, వారానికి ఒకసారి ధరణిపై సమీ క్షించాలని అదనపు కలెక్టర్‌ ఎం. డేవిడ్‌ను ఆదేశించారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువచ్చి పరి ష్కారం కోసం సీసీఎల్‌ఏకు వివరాలు పంపే విధంగా చూ డాలని తెలిపారు. అలాగే ప్రతీ వారం ఒక మం డలంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టి పరిష్క రిం చాలని చెప్పారు. పెండెన్సీనాలి, పీవోబీ, మ్యూటేషన్‌, జీఎల్‌ఎం, టెక్నికల్‌ కారణాలతో ఆగిపోయిన దరఖా స్తులపై సమీక్షించారు. అర్హులకు ఓఆర్‌సీ ఇచ్చి పీవోబీ నుంచి తొలగించాలని, టెక్నికల్‌ కారణాలతో ఆగిపోయి న వాటిని వెంటనే పరిష్కరించి అర్హులకు న్యాయం చేయాలని తెలిపారు. గ్రామాల వారీగా నాలా భూమి వివరాలు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఎం. డేవిడ్‌, కలెక్టరేట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు పున్నంచందర్‌, శ్యామ్‌, ప్రవీణ్‌, బాస్కర్‌, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-25T05:55:03+05:30 IST