బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు: ఎమ్మెల్సీ తాత మధు

ABN , First Publish Date - 2022-04-19T02:30:25+05:30 IST

బీజేపీ , కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకే తానులో ముక్కళ్లగా.. కుక్కళ్లగా మొరుగుతున్నారని ఎమ్మెల్సీ తాత మధు అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ తోడుదొంగలు: ఎమ్మెల్సీ తాత మధు

హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఒకే తానులో ముక్కళ్లగా.. కుక్కళ్లగా మొరుగుతున్నారని  ఎమ్మెల్సీ తాత మధు ఎద్దేవా చేశారు. సోమవారం మధు మీడియాతో మాట్లాడుతూ.. సాయి గణేష్ ఆత్మహత్య కు రాజకీయ రంగు పులిమి టీఆర్ఎస్‌పై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. బీజేపీ , కాంగ్రెస్ తోడుదొంగలు, సాయి గణేష్ ఆత్మహత్యను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు.బండి సంజయ్ నీ సొల్లు కబుర్లు వినేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. బండి సంజయ్ ఖమ్మం వచ్చి ఏదో చేస్తానంటున్నావు  దమ్ముంటే ఖమ్మంరా.....తేల్చుకుందాం  అని సవాల్ విసిరారు. రేవంత్‌రెడ్డి నీ ప్రతాపం మహబూబ్‌నగర్‌లో చూపించు.....ఖమ్మం వస్తే నీ సంగతి తేలుస్తామని హెచ్చరించారు. సాయి గణేష్ ఆత్మహత్య విచారకరం....సాయి గణేష్ ఆత్మహత్యపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తాత మధు పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-19T02:30:25+05:30 IST