సకాలంలో రుణాలు అందించి లక్ష్యాలు సాధించాలి

ABN , First Publish Date - 2022-12-07T23:49:35+05:30 IST

సకాలంలో బ్యాంక్‌ రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సెప్టెంబరు వరకు రూ.631 కోట్లు వ్యవసాయ పంట రుణాలుగా అందజేసినట్లు తెలిపారు. వీటితోపాటు దీర్ఘకాలిక రుణాలుగా రూ.297కోట్లతో మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.928కోట్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు.

సకాలంలో రుణాలు అందించి లక్ష్యాలు సాధించాలి

బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ పమేలాసత్పథి

భువనగిరి రూరల్‌, డిసెంబరు 7: సకాలంలో బ్యాంక్‌ రుణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత సెప్టెంబరు వరకు రూ.631 కోట్లు వ్యవసాయ పంట రుణాలుగా అందజేసినట్లు తెలిపారు. వీటితోపాటు దీర్ఘకాలిక రుణాలుగా రూ.297కోట్లతో మొత్తంగా వ్యవసాయరంగానికి రూ.928కోట్లు బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు తెలిపారు. సూక్ష్మ రుణాల కింద సూక్ష్మ, చిన్నస్థాయి పరిశ్రమలకు రూ.167కోట్లు పంపిణీ చేశామన్నారు. విద్యారుణాలుగా రూ.8కోట్లు, గృహ రుణాలుగా రూ.19కోట్లు అందజేసినట్లు వివరించారు. జిల్లాలో 11,903 మహిళా సంఘాలకు రూ.518కోట్లు రుణాలు లక్ష్యం నిర్దేశించగా, ఇందులో ఇప్పటి వరకు 5,814 సంఘాలకు రూ.334కోట్లు అందించినట్లు తెలిపారు. నాబార్డు ద్వారా రాబోయే 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక రుణప్రణాళికను కలెక్టర్‌ విడుదల చేశారు. జిల్లాలో రూ.3,508 కోట్లు రుణ లక్ష్యంగా నాబార్డు నిర్ణయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.2,976 కోట్లు, సూక్ష్మ, రుణ ప్రణాళిక కు రూ.353కోట్లు, విద్యారంగానికి రూ.25కోట్లు, గృహ నిర్మాణానికి రూ.116 కోట్లు, ఇతర మౌలిక వసతులకు రూ.21కోట్లు, సోలార్‌ ఎనర్జీ రూ.15కోట్లు బ్యాంక్‌ల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్‌డీవో మందడి ఉపేందర్‌రడ్డి, లీడ్‌ బ్యాంక్‌ అధికారి కె.రామకృష్ణ. ఆర్‌బీఐ లీడ్‌ జిల్లా అధికారి శివరామన్‌, నాబార్డు జీడీఎం వినయ్‌కుమార్‌, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మీ, జిల్లా పశువైధ్యాధికారి డాక్టర్‌ వి.కృష్ణ, మెప్మా పీడీ రమేశ్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి రాజారామ్‌, మునిసిపల్‌ కమిషనర్లు, బ్యాంక్‌ల మేనేజర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:49:44+05:30 IST