రాజ్యాంగాన్ని మార్చాలన్న వారినే మార్చేద్దాం!

ABN , First Publish Date - 2022-03-05T07:09:10+05:30 IST

స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న వారి

రాజ్యాంగాన్ని మార్చాలన్న వారినే మార్చేద్దాం!

  • అంబేద్కర్‌ మనుమడు పిలుపు


భైంసా, మార్చి 4: స్వార్ధపూరిత ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని మార్చాలన్న వారి రాజకీయ అస్తిత్వాన్నే మార్చేద్దామని వంచిత్‌ బహుజన్‌ అఘాడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంబేద్కర్‌ మనువడు ప్రకాష్‌ అంబేద్కర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్‌ జిల్లా భైంసాలో నిర్వహించిన వంచిత్‌ బహుజన్‌ అఘాడీ పార్టీ జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా అధికార పీఠమెక్కిన కొంతమంది రాజ్యాంగాన్నే మార్చాలనుకోవడం సరైన విధానం కాదన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి తరం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. అనంతరం భైంసా బస్టాండ్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన 11 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, అద్దంకి దయాకర్‌ తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు.  


Updated Date - 2022-03-05T07:09:10+05:30 IST