Gutta Sukhender Reddy: బీజేపీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరు...మునుగోడులో మునగడం ఖాయం
ABN , First Publish Date - 2022-08-09T18:08:40+05:30 IST
కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.

నల్గొండ: కాంట్రాక్టుల కోసం రాజగోపాల్ రెడ్డి బీజేపీ (BJP) వైపు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (gutta sukhender reddy ) ఆరోపించారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో గుత్తా మాట్లాడుతూ... రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) రాజీనామా బీజేపీకి అవసరమని... ఆపార్టీ ఒత్తిడితోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు. బీజేపీ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఇమడలేరని, మునుగోడు ఎన్నికల్లో మునగడం ఖాయమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గెలవనని రాజగోపాల్ రెడ్డికీ తెలుసన్నారు. మునుగోడులో పోటీ చేయాలని ఎవరూ తనను అడగలేదని... అడిగితే ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.