Lawyer Gattu Vamanarao హత్య కేసులో టీసర్కార్‌కు సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2022-09-09T20:04:09+05:30 IST

న్యాయవాది గట్టు వామనరావు(Lawyer Gattu Vamanarao) దంపతుల హత్యపై సీబీఐ(CBI) విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో

Lawyer Gattu Vamanarao హత్య కేసులో టీసర్కార్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ : న్యాయవాది గట్టు వామనరావు(Lawyer Gattu Vamanarao) దంపతుల హత్యపై సీబీఐ(CBI) విచారణ జరిపించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. వామనరావు తండ్రి కిషన్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర పోలీసులతో సంబంధం లేని సంస్థతో విచారణ జరపాలన్న తమ విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు(Telangana High Court) పరిగణనలోకి తీసుకోలేదని కిషన్‌రావు తరపు న్యాయవాది తెలిపారు. గట్టు వామనరావు హత్యపై ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయని, హత్యకు సంబంధించిన అనేక విషయాలు పొందుపరచలేదని న్యాయవాది పేర్కొన్నారు. వాదనల అనంతరం... పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రభుత్వా(Telangana Government)నికి జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.


గతంలో న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, పీవీ నాగమణి హత్యలపై పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగానే జరుగుతోందని హైకోర్టు(High Court) ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తు తీరును వివరిస్తూ పోలీసులు ఇచ్చిన స్థాయీ నివేదికను పరిగణనలోకి తీసుకుంది. హత్యలపై సీబీఐ విచారణ కోరుతూ మృతుడి తండ్రి గట్టు కిషన్‌రావు దాఖలు చేసిన వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో కిషన్‌రావు సుప్రీంను ఆశ్రయించారు.


కాగా.. పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు, నాగమణి హత్య దారుణంగా హత్య చేశారు. కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను దుండగులు మరో కారులో వచ్చి అడ్డుకున్నారు.. కారులోంచి న్యాయవాదిని బయటకు లాగి కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. కారులో ఉన్న ఆయన భార్యపైనా కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీశారు. ఈ దారుణ ఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద చోటుచేసుకుంది. మంథని మండలం గుంజపడుగుకు చెందిన గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హైకోర్టులో న్యాయవాదులుగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరి తొలి వారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Updated Date - 2022-09-09T20:04:09+05:30 IST