ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు..

ABN , First Publish Date - 2022-10-18T04:53:28+05:30 IST

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు..

ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు..
ఆందోళన చేస్తున్న బాధితులు

 కేయూ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బాధితుల ఆందోళన

హనుమకొండ టౌన్‌, అక్టోబరు 17: మునిసిల్‌ కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికులుగా ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.3లక్షల చొప్పున వసూలు చేసి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపిస్తూ బాధితులు కేయూ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళన చేసారు. భీమారం గ్రామానికి చెందిన 24మంది బాధితులు సోమవారం స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కిందటేడు పారిశుధ్య విభాగంలో ఉద్యోగాలిప్పిస్తామని ఒక్కరి నుంచి రూ.3లక్షల చొప్పున సంగాల చిన్న, సంగాల పృథ్వీ, బొక్క ప్రవీణ్‌ తీసుకున్నారని ఆరోపించారు. కొద్ది రోజులు పనులు చేసిన తమను అధికారులు తొలగించినట్లు వారు తెలిపారు. ఈ విషయమై డబ్బులు తీసుకున్న ముగ్గురిని నిలదీయగా ముఖం చాటేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇళ్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని బాధితులు పేర్కొన్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు ఇప్పించి ముగ్గురిపై చర్య తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులతో స్టేషన్‌కు వచ్చి ఆందోళనకు దిగారు. అనంతరం బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. కాగా, డబ్బులు వసూలు చేసిన వారిని పోలీసులు స్టేషన్‌కు పిలువగా అందరి సమక్షంలోనే వారు గొడవపడ్డారు. బాధితులు పిర్యాదు చేసిన విషయాన్ని కేయూ ఎస్‌ఐ సంపత్‌ ధ్రువీకరించారు. 

Updated Date - 2022-10-18T04:53:28+05:30 IST